ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (11:54 IST)

కోరిక తీర్చాలని కోడలిని వేధించిన మామ.. నిరాకరించడంతో గొంతుకోసి..?

ఓ మామ కోడలి పాలిట యముడిగా మారాడు. కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో దారుణంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని కురవి మండల కేంద్రం శివారులోని సొమ్లా తండాలో భూక్యా తన కొడుకు భార్య కోడలు రజితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.
 
గత కొద్ది రోజులుగా మామ రజితను కోరిక తీర్చమని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని రజిత తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వాళ్ళు మమను హెచ్చరించారు. దాంతో కోపం పెంచుకున్న దుర్మార్గుడు కోడలిని హత్య చేశాడు.
 
ఆ సమయంలో రజిత భర్త కూలి పనులకు వెళ్ళగా కూతుళ్లు గురుకులంలో చదువుకుంటున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం