1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (12:32 IST)

కొమురం భీం జిల్లాలో పులి.. ఎద్దును చంపేసింది..

తెలంగాణలో ఇటీవల కాలంలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది. కొమురం భీం జిల్లాలో తెల్లవారు జామున ఓ పులి గ్రామంలోకి ప్రవేశించి ఎద్దును చంపేసింది. ప్రజలు అలర్ట్ కావడంతో అక్కడి నుంచి పులి పారిపోయింది. ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. 
 
దేవరకద్ర మండలంలోని నాగారం గ్రామం శివారులో చిరుత లేగదూడను చంపి తినేసింది. ఇక ముచ్చింతల్ లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. చిరుతల పాదముద్రలు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.