శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (13:01 IST)

ట్రంకు పెట్టెలో కరెన్సీ నోట్లు.. ఐదు లక్షలు చెదల పాలు.. ఎక్కడ?

ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త బ్యాంకు కంటే తన ఇంట్లోని ట్రంకు పెట్టే సేఫ్ అనుకున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఆ పెట్టెలో పెట్టాడు. కట్టల కొద్దీ డబ్బు. రూ.500, 200, 100 నోట్ల కట్టలు. కానీ ఆ డబ్బు కాస్తా చివరికి చెదల పాలైంది. 
 
ఏకంగా రూ.5 లక్షల్ని చెదలు తినేశాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మైలవరంలో ఉన్న బిజిలీ జమాలయ్య ఇంట్లో చోటుచేసుకుంది. పందుల వ్యాపారం చేసే అతడు.. నగదు రూపంలోనే వ్యాపారం చేస్తాడు. ఇందులో వచ్చే డబ్బు మొత్తాన్నీ బ్యాంకులో వేసే బదులు ఇంట్లోని ట్రంకు పెట్టెలోనే పెట్టేవాడు. 
 
బాగా డబ్బు జమ చేసి ఇల్లు కట్టుకోవాలన్నది జమాలయ్య కల. దీనికోసం ఇప్పటికే రూ.5 లక్షలు జమ చేశాడు. తాను చెమటోడ్చి సంపాదించిన డబ్బంతా చెదల పాలవడం చూసి తెగ బాధపడిన అతడు.. ఆ మిగిలిన కరెన్సీ ముక్కలను చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచి పెట్టడం విశేషం. పిల్లల చేతుల్లో పెద్ద పెద్ద నోట్లు కనిపించే సరికి పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది.