మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:30 IST)

బ్యాలెట్ పత్రాల్లో తప్పులు.. నిలిచిన పోలింగ్..ఎక్కడ?

గుంటూరు జిల్లాలోని గురజాల మండలం మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు రావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇద్దరు అభ్యర్థులకు అధికారులు ఒకే గుర్తు ముద్రించారు.

దీంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. తిరిగి ఈనెల 21న మాడుగులలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 
 
ఓటు వేయ కుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా?
ఓటు వేయ కుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా? ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారా.. అని పాలకులపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

నరసరావుపేట నియోజకవర్గం గోగులపాడు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే కక్షతో ఇస్సపాలెంలో ఇళ్లలోకి వెళ్లే మెట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని టీడీపీ ఉన్నత స్థాయి కమిటీ సందర్శించి బాధితులను పరామర్శించింది. జరిగిన సంఘటనను కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.

అనంతరం వర్ల రమయ్య మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారని ఇలా నిర్మాణాలు కూల్చివేయడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే పేరుకే డాక్టర్‌ అని, ఆయనకు మానవత్వం లేదని విమర్శించారు.