శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:56 IST)

బీహార్‌లో రెండోవిడత పోలింగ్‌ ప్రారంభం

బీహార్‌లోని  మూడు విడతల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో... కీలకంగా చెబుతున్న రెండో దశ పోలింగ్  ప్రారంభమైంది. మొత్తం 243 స్థానాల్లో 94 స్థానాలకు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య మంగళవారం పోలింగ్‌ జరుగుతోంది.

ఇందుకోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.   కాగా, మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థి అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(రాఘోపుర్‌), ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌(హసన్‌పుర్‌)నుండి పోటీ చేస్తున్న స్థానాల్లో నేడు పోలింగ్‌ జరుగుతోంది.

అలాగే, నితీశ్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నంద్‌ కిశోర్‌ యాదవ్‌-భాజపా(పట్నా సాహెబ్‌), శ్రవణ్‌కుమార్‌-జేడీయూ (నలంద), రామ్‌సేవక్‌ సింగ్‌-జేడీయూ(హథువా), రాణా రణ్‌ ధీర్‌ సింగ్‌-భాజపా(మధుబన్‌)ల భవితవ్యం కూడా నేడు తేలనుంది.

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని ఓటర్లకు సూచించింది ఈసీ. అలానే అన్ని కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.