సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (11:52 IST)

1913 నాటి రూపాయి నాణేం వుంటే.. రూ.25 లక్షలు గెలుచుకోవచ్చు..

మీరు 1913 నాటి రూపాయి నాణేన్ని కలిగిఉంటే రూ.25లక్షలకు వేలం వేయవచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్‌పై రూ.25 లక్షలుగా నిర్ణయించారు. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ 10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్‌పై రూ.10 లక్షలుగా ఖరారు చేశారు. 
 
ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్‌ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు అరుదైన, పురాతన నాణేలను విక్రయించదలిస్తే మీరు ఇండియామార్ట్‌ వెబ్‌సైట్‌ ఇండియామార్ట్‌.కాంను సంపద్రించవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై మీరు మీ ఖాతాను తెరిచి, వెబ్‌సైట్‌లో విక్రేతగా మీ పేరు నమోదు చేసుకోవాలి. 
 
రిజిస్ట్రేషన్‌ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్‌లోడ్‌ చేసి వాటిని సేల్‌లో ఉంచవచ్చు. పురాతన నాణేల సేకరణ పట్ల ఉత్సాహం చూపే వారు ఇలాంటి అవకాశాల కోసం చూస్తుంటారు. ఈ అరుదైన నాణేలను సొంతం చేసుకునేందుకు వారు పెద్దమొత్తం చెల్లించేందుకు వెనుకాడరు.