సంబంధిత వార్తలు
- దంపతుల మధ్య దాపరికాలు.. భార్యకు తెలియకుండా సెటప్ చేశాడు.. చివరికి?
- నీ పెళ్లి కుదిరింది, నా డెత్ టైమ్ ఫిక్స్ చేశానంటూ ప్రియురాలికి సెల్ఫీ వీడియోలో...
- మైనర్‌తో 20 యేళ్ళ యువతి సహజీవనం.. అంతలోనే...
- వివాహ వేడుకలో వధువు మృతి.. చెల్లెలితో వరుడికి పెళ్లి.. మృతదేహాన్ని గదిలో పెట్టి..?
- పెళ్ళయి సంవత్సరమే, ప్రియుడి కోసం ఇంట్లో బంగారు, వెండి దొంగతనం
పెళ్లి చేసుకుని.. ప్రియుడితో జంప్ కావాలనుకుంది..
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది కానీ రాత్రికి రాత్రే ప్రియుడితో కలిసి పారిపోవాలని వధువు ప్లాన్ చేసింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువతికి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెండ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శనివారమే వరుడి గ్రామానికి చేరుకున్నారు.
పెండ్లి పీటలపై కూర్చున్న వధువు అదే పనిగా సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తుండడం, ఎవరితోనో మాట్లాడుతుండడంతో అనుమానించిన బంధువులు నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాను మూడేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని, పెండ్లి జరిగిన తర్వాత రాత్రికి అతడితో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నామని అంగీకరించింది.
అదే సమయంలో అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన వరుడి తరపు బంధువులు అతడు చెప్పింద విని విస్తుపోయారు. అతడి సెల్‌ఫోన్‌లో ఇద్దరి ఫొటోలను చూసి షాకయ్యారు. వెంటనే వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన పోలీసులు ఎవరూ కేసు పెట్టకపోవడంతో ఇద్దరినీ వదిలేశారు. ఇరు వర్గాల అంగీకారంతో వధూవరులు ఎవరింటికి వారు వెళ్లిపోయారు.
తర్వాతి కథనం
