బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 31 మే 2021 (13:01 IST)

నీ పెళ్లి కుదిరింది, నా డెత్ టైమ్ ఫిక్స్ చేశానంటూ ప్రియురాలికి సెల్ఫీ వీడియోలో...

ప్రియురాలికి మరొకరితో వివాహం ఫిక్స్ అయిందని తెలిసిన ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలికి సెల్ఫీ వీడియో తీసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లా గుర్రంపోడుకి చెందిన మైదాసు రమేశ్, యాకాశమ్మ దంపతుల కుమారుడు రాకేశ్‌. ఇతడు అదే ప్రాంతానికి చెందిన యువతిని కొంతకాలంగా ఇష్టపడుతున్నాడు. ఐతే ఆ యువతి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ నిన్ను తప్ప మరొకర్ని నా జీవితంలో ఊహించుకోలేను అంటూ చెపుతుండేవాడు.
 
ఈ క్రమంలో అతడు ప్రేమించిన యువతికి మరొకరితో జూన్‌ 2న వివాహం నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. ఇది తెలుసుకున్న రాకేష్ తీవ్ర మనస్థాపానికి లోనై, నువ్వే నా ప్రాణమని చెప్పా, అలాంటిది నువ్వు వేరేవాడిని పెళ్లాడితే ఇక నేను బతికెందుకు, చివరిసారిగా నన్ను చూడు అంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఈ వీడియో స్నేహితుల వాట్సప్ లో పెట్టడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అతడు ఆదివారం నాడు మృతి చెందాడు.