మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:24 IST)

జడ్చర్లలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని కోడ్గల్‌లో రెండు పడక గదుల ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ   రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా  రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 
 
ఆపై నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేటలో ఎంజేఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పునర్‌నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా రెండుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారన్నారు. ఎన్‌డీఏ హయాంలోనే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ రాజ్యాంగ సమీక్షకు కమిటీని వేశారన్నారు. 
 
సవరణ అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ గతంలోనూ ప్రస్తావించిందన్నారు. వారంతా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనా అంటూ ప్రశ్నించారు.