శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (15:47 IST)

బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులకు తరగతులు ... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసు తగ్గుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారింది. చదువులు ఆటకెక్కాయి. పేరుకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ వాటివల్ల విద్యార్థులకు ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. 
 
ముఖ్యంగా, ప్రత్యక్ష బోధనా తరగతులు గత 2020 నుంచి మాయమైపోయాయి. ఇలాంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కూడా ఒకటి. అయితే, కొన్ని రోజులుగా 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం పాక్షికంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభించడంతో పాఠశాలలు మూసివేశారు. ఈ క్రమంలో పాఠశాలలు తెరవకపోతే విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
దీంతో "పరే శిక్షాయ్" పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఆరు బయట తరగతులను నిర్వహించనున్నారు. అంటే ప్రభుత్వ  పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బహిరంగ ప్రదేశాల్లో పాఠాలు బోధిస్తారు. తొలుత ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలకు ఈ తరహా క్లాసులు నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే మిగిలిన అన్ని తరగతులకు ఇదే విధంగా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారు.