శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:46 IST)

నా భార్యను పట్టిస్తే రూ.5 వేలు బహుమతి : భర్త ప్రకటన

ప్రియుడితో లేచిపోయిన తన భార్యను పట్టించినా, ఆచూకీ తెలిపినా ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందజేస్తానని ఓ భర్త ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. భార్యతో పాటు కుమారుడిని కూడా వెంట బెట్టుకుని పోవడంతో బాధిత భర్త తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. 
 
ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో వెలుగు చూసింది. ఈ నెల 9వ తేదీ రాత్రి బాధితుడి భార్య ప్రియుడితో కలిసి నంబరు లేని కారులో లేచిపోయింది. ఇంట్లో ఉన్న నగలు, ఆభరణాలు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులతో పాటు పిల్లాడి బర్త్ సర్టిఫికేట్‌ను కూడా తీసుకెళ్లిందని బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఇపుడు వారిద్దరి ఆచూకీ తెలిపిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు. పైగా, భార్యపిల్లవాడితో కలిసివుండటమే తన లక్ష్యమని, అందువల్ల వారిద్దరూ కలిసి రావాలని కోరారు.