శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (17:39 IST)

హృతిక్ రోషన్ మాజీ భార్యతో అర్స్లాన్‌తో లవ్... ఈ ఫోటోనే సాక్ష్యం?

Hrithik Roshan
బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో వున్నారని బిటౌన్‌లో రచ్చ రచ్చ జరుగుతోంది. ఈ రచ్చకు ఊతమిచ్చేలా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను సుసానే సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్‌ 20న అర్స్లాన్ గోని బర్త్‌డే. ఈ సందర్భంగా సుసానే అతడితో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. 
 
ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే. అంటూ నా జీవితంలో ఇప్పటి వరకు నేను చూసిన ఒక అందమైన శక్తివి నీవు' అంటూ రాసుకొచ్చింది. దీనికి గోనీ స్పందిస్తూ.. 'లవ్ యూ' అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ పోస్టు కొందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ పోస్ట్‌కు కొందరు మద్దతుగా కామెంట్‌ చేస్తుండగా..  మరి కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
 
అలాగే అక్టోబర్‌లో సుసానే పుట్టినరోజు సందర్భంగా గోనీ కూడా ఇదే విధంగా స్పందించాడు. 'హ్యాపీ బర్త్ డే డాలింగ్. నీ జీవితం అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ గ్రీటింగ్స్ చెప్పాడు. 
 
కాగా హృతిక్‌ రోషన్‌ చిన్ననాటి స్నేహితురాలైన సుసానేను 2000 సంవత్సరంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. అయితే విభేదాల వల్ల 2014లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.