సమంత కంటికి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అంత హాట్‌గా కనిపించారా?
తన భర్త అక్కినేని నాగచైతన్యతో ఉన్న వైవాహిక బంధానికి తెగదెంపులు చేసుకోనున్నట్టు ప్రకటించిన హీరోయిన్ సమంత ఇపుడు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా "పుష్ప" చిత్రంలో ఆమె ఐటమ్ సాంగ్‌లో ఇరగదీశారు. ఈ పాట చిత్రానికే హైలెట్‌గా నిలుస్తోంది.
ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి చెందిన కొన్ని ఫోటోలు ఇన్‌స్టా ఖాతాలో షేర్ అయ్యాయి. ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ శారీ విత్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్నేహారెడ్డి అందరినీ ఆకర్షించింది. ఈ ఫోటోలను చూసిన పలువురు సినీ ప్రముఖులు తమకు తోచిన విధంగా కామెంట్స్ పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో హీరోయిన్ సమంత కూడా కామెంట్స్ చేశారు. స్నేహా రెడ్డి ఫోటోలకు హాట్ అండ్ రెడ్ ఎమోజీని జత చేసి షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అయింది. కాగా, సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కరే స్నేహాకు కూడా స్టైలిస్ట్‌గా ఉ్న విషయం తెల్సిందే.