మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 3 మార్చి 2022 (21:16 IST)

అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతామో లేదో మీరే చూడండి: మంత్రి బొత్స

ఏపీకి అమరావతి రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం రాత్రి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

 
రాష్ట్రాభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలనీ, అది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదన్నారు. అలాగే రాజధాని అనేది ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినదిగా వుండకూడదనీ, రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా వుండాలని సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు.

 
ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును ప్రవేశపెడతామో లేదో వేచి చూడాలన్నారు. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని పార్లమెంటులో కేంద్రం చెప్పిన సంగతిని గుర్తు చేసారు. న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.