1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (18:33 IST)

ఏపీలో ముందస్తు ఎన్నికలు? వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఏమన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ సీపీ ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి వచ్చే 2024 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుంది. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
దీనిపై వైకాపాకు చెందిన రాజంపేట లోక్‌సభ సభ్యుడు మిథున్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిందని, అలాగే, 2024లో జరిగే ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని తెలిపారు. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో వైకాపా నేతలు చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు.