సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (17:21 IST)

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు భద్రత పెంపు ... నిఘా విభాగం నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పోలీస్ భద్రతను పెంచింది. ఈయన్ను హత్య చేసేందుకు రూ.15 కోట్ల సుపారీతో ఓ కిరాతక ముఠా పన్నిన కుట్రను సైబరాబాద్ పోలీసులు చేధించిన విషయం తెల్సిందే. ఈ ప్లాన్ అమలుకు ముందే బయటపడింది. దీంతో శ్రీనివాస్ గౌడ్‍‌కు ప్రాణాపాయం తప్పింది. 
 
అయితే, మంత్రి హత్యకు కుట్ర, తదనంతర పరిణామాలను పరిశీలించిన రాష్ట్ర నిఘా విభాగం తాజాగా ఆయనకు భద్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని నిఘా విభాగ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వెంట జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రానికి సాయంత్రానికి తిరిగిరానున్నారు. రాష్ట్రానికి వచ్చిన మరుక్షణమే ఆయనకు భద్రత పెంచాలని నిఘా విభాగం అధికారులు నిర్ణయించారు.