శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (07:29 IST)

తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ హత్యకు రూ.15 కోట్ల సుపారీ : స్టీఫెన్ రవీంద్ర

తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేస్తే కిరాయి ముఠాకు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు సుపారీ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. 
 
కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానిరి రాజీనామా చేసి తెరాసలో చేశారు. తొలి ప్రభుత్వం ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్, రెండోసారి గద్దెనెక్కిన తెరాస ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తెరాస ప్రభుత్వ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన హత్యకు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్‌‍తో హత్యకు ప్రణాళిక రచించినట్టు తేలిందన్నారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్ల సుపారీ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నార. మహబూబ్ నగర్‌కు చెందిన వ్యక్తులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను లక్ష్యంగా చేసుకుని హత్యకు కుట్ర చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలంరేపింది.