గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (14:55 IST)

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

ఉక్రెయిన్ దేశంపై రష్యా ప్రభుత్వం బాంబుల వర్షం కుపిస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు... మిగిలిన పట్టణాలను సైతం స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు సాగిపోతున్నాయి. ముఖ్యంగా, ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తున్నాయి. అదేసమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఆ దేశంలో 20 వేల మంది భారతీయులు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేయగా, అందులో 4 వేల మంది తెలుగు విద్యార్థులు ఉండటం గమనార్హం. 20 వేల మందిలో 4 వేల మంది ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. మిగిలినవారిని సురషితంగా భారత్‌కు తరలించేందుకు చర్యలు కేంద్రం చర్యలు చేపట్టింది. 
 
ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, సీఎంవో అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇక కలెక్టర్ల స్థాయిలో కూడా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు.