1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Ukraine President Says Left Alone To Fight Against Russian

స్వాతంత్ర్య పోరాటంలో ఒంటరిగా మిగిలిపోయాం : ఉక్రెయిన్ అధినేత ఆవేదన

Ukraine President
స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా తమ దేశంపై దాడికి దిగితే నాటో దేశాలతో పాటు తమ మిత్ర దేశాలు తమకు అండగా నిలుస్తాయని భావించామని కానీ అలాంటిదేమీ జరగలేదని ఆయన వాపోయారు. 
 
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా.. అన్ని వైపుల నుంచి భీకర దాడులు చేస్తుంది. భూతలం, గగనతలం అనే తేడా లేకుండా అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుంది. మరోవైపు, ప్రపంచ దేశాల ఆదేశాలను సైతం రష్యా ధిక్కరించి ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తుంది. 
 
ఈ పరిణామాలపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ స్పందిస్తూ, రష్యాతో జరుగుతున్న పోరులో తాము ఒంటరిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రష్యా తమపై దాడికి పూనుకుంటే ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని, కానీ, అలాంటిదేమీ జరగలేదని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని పేర్కొన్నారు. 
 
అసలు మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా లేదా అంటూ తమ మిత్ర దేశాలను ఆయన ప్రశ్నించారు. ఒకవేళ తమకు మద్దతుగా ఉంటే నాటో కూటమిలోకి మమ్మల్ని తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరంటూ ఆయన నిలదీశారు.  
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను క్షేమంగా తీసుకొస్తాం: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్