గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 15 జనవరి 2022 (13:51 IST)

సంక్రాంతికి కోడి పందేలు, స్టేడియం తరహా ఏర్పాట్లు చేసి మరీ....

సంక్రాంతి పండుగ అంటేనే కోడిగిత్తెల రంకెలు, కోడిపుంజుల పోటీలు గుర్తుకొస్తాయి. నిషేధం ఉన్నా పట్టించుకోరు. దెబ్బలు తగులుతున్నా లెక్కచేయరు. పోటీల్లో పాల్గొంటూనే ఉంటారు. సాంప్రదాయంగా వచ్చే క్రీడను కొనసాగిస్తామని పోలీసులకు తేల్చి చెప్పి మరీ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. 

 
చిత్తూరు జిల్లాలో కోడిగిత్తెల పందేలు జరుగుతున్నాయి. కోడిగిత్తెలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు యువకులు. చంద్రగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఈ జల్లికట్టు క్రీడలు కొనసాగుతున్నాయి.

 
అటు తూర్పుగోదావరి జిల్లాలో 400కి పైగా ప్రాంతాల్లో కోడి పందేలు కొనసాగుతున్నాయి. అత్యాధునికమైన స్టేడియం తరహాలో ఏర్పాట్లు నడుమ కోట్లాది రూపాయల మేర బెట్టింగులు చేస్తూ రెండోరోజు కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.

 
ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లంకుర్రు, గెద్దనాపల్లి, చెయ్యారు, నడవపల్లి, రాజుపాళెం, పల్లిపాళెం, అన్నంపల్లి, కొత్త లంక, మురమళ్ళ, కొమరగిరి, కేశనగుర్రు, మూలపొలం గ్రామాల్లో జోరుగా కోడిపందాలు జరుగుతున్నాయి.

 
అలాగే అమలాపురం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయా గ్రామాల్లో జోరుగా కోడి పందేలు జరుగుతున్నాయి. కాకినాడ రూరల్‌లో తిమ్మాపురం, సర్పవరం, వలసపాకల, వాకలపూడి, నేమాం, పండూరు, చీడిగ, గంగనాపల్లి గ్రామాలలో జోరుగా రెండో రోజు కోడి పందాలు జరుగుతున్నాయి. రామచంద్రాపురం, మండపేట, అనపర్తి, గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో జోరుగా పందేలు సాగుతున్నాయి.