గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (13:02 IST)

దారి దోపిడీ దొంగలను చాకచక్యంగా ప‌ట్టేసిన‌ చంద్రగిరి పోలీసులు

దారికాచి... వాహ‌నాల్ని ఆపి డ్రైవ‌ర్ల‌ను బెదిరించి దోపిడీ చేసే ముఠాను పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ఈ నెల 10 తెల్లవారుజామున సుమారు 1:30 గంటలకు తిరుప‌తి తొండవాడ బైపాస్ సర్వీస్ రోడ్డులో టిఎన్19ఎవై2289  ఐషర్ వాహనాన్ని ఆపి దోపిడీ దొంగ‌లు దోచుకున్నారు. ఓన‌ర్ యం.మునెప్పరాజును  నిద్రలేపి, డ్రైవర్ ను బెదిరించి అతని వద్ద ఉన్న వివో ఫోన్, 6వేల రూపాయలను బలవంతంగా లాక్కొని వెళ్ళారు. 
 
 
దీంతో డ్రైవర్ మునెప్పరాజు దగ్గర్లో ఉన్న చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు వెస్ట్ డిఎస్పి నరసప్ప ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు.ఈ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ముద్దాయిలను చంద్రగిరి సిఐ.బివి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొండవాడ గ్రామంలోని ముక్కోటి గుడికి ముందు ఉన్న రోడ్ పక్కన రెక్కీ వేసి, దారి దోపిడీ దొంగ‌ల‌ను చాక‌చ‌క్యంగా అరెస్టు చేశారు. వారి నుండి బజాజ్ పల్సర్, స్ప్లెండర్ ప్లస్ ద్వి చక్ర వాహనాలను, ఇనుప కట్టర్ ను, 6వేల నగదును స్వాధీనం చేసుకొని చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.