బట్టలు లేకుండా మరో యువతితో ఫోటో, బ్లాక్ మెయిలింగ్
సైబర్ నేరగాళ్లు రకరకాల దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఓ యువకుడి ఫోటోను మార్ఫింగ్ చేసి బట్టలు లేకుండా చేసి మరో యువతి పక్కన ఫోటో దిగినట్లు చేసి బ్లాక్ మెయిలింగ్ చేసారు.
పూర్తి వివరాలు చూస్తే... హైదరాబాద్ హిమాయత్ నగరానికి చెందిన ఓ యువకుడికి చెందిన ఫోటోలను మార్ఫింగ్ చేసి మరో యువతి పక్కన దుస్తులు లేకుండా పెట్టారు. ఆ ఫోటోలను బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తామని బెదిరించారు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసారు.
ఆ ఫోటోలతో తన పరువు పోతుందని భావించిన యువకుడు వారికి రూ. 2.89 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారి వేధింపులు మరింత తీవ్రం కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.