సంబంధిత వార్తలు
- చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ
- మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు
- ఫెర్టిలిటీ ఇష్యూ సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య : డైరెక్టర్ సంజీవ్ రెడ్డి
- Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు
- సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు
సంతాన ప్రాప్తిరస్తు తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది - తరుణ్ భాస్కర్
Tarun Bhaskar
ఫ్యునెరల్ సర్వీసెస్ నడిపే జాక్ రెడ్డికి కుల పట్టింపు ఎక్కువే. ఆయన ఈ పాత్రలో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. రీసెంట్ గా "సంతాన ప్రాప్తిరస్తు" మూవీ ప్రివ్యూ చూసిన తరుణ్ భాస్కర్..సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. సొసైటీలో ప్రస్తుతం ఉన్న ఇన్ ఫెర్టిలిటీ ఎలిమెంట్ తో ఫన్, ఎమోషన్ కలిపి ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టమని, "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టీమ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారని తరుణ్ భాస్కర్ అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ - "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉండేవి. కానీ మూవీ చూశాక నా అనుమానాలు అన్నీ ఎగిరిపోయాయి. ఇదొక డీసెంట్ మూవీ. సరదాగా అలా మూవీ అంతా వెళ్లిపోయింది. మనం బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానా మూవీస్ చూస్తుంటాం. అలాంటి ఫీల్ కలిగింది. సొసైటీలో ఇప్పుడున్న సంతాన లేమి అనే సమస్యను ఎంటర్ టైనింగ్ గా, ఎమోషన్ గా చెప్పడం క్లిష్టమైన పని. "సంతాన ప్రాప్తిరస్తు" టీమ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఇంట్లో చేసిన మంచి తెలుగు మీల్స్ తిన్నప్పుడు ఎలాంటి తృప్తి ఉంటుందో, అలాంటి ఫీల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. సినిమా ఎక్కడా హెవీగా అనిపించలేదు, ఓవర్ డ్రామా లేదు, సరదాగా చూస్తూ వెళ్లాను. నేను చేసిన జాక్ రెడ్డి క్యారెక్టర్ లాంటి వాళ్లు బయట కనిపిస్తుంటారు. పైకి టఫ్ గా కనిపిస్తున్నారు గానీ వాళ్ల లోపల సాఫ్ట్ నెస్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ కు స్పిన్నాఫ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమాను రూపొందించాడు. చైతన్య క్యారెక్టర్ లో విక్రాంత్ పర్పెక్ట్ గా కుదిరాడు. కాస్టింగ్ అందరి నుంచి మంచి పర్ ఫార్మెన్స్ చూస్తారు. అలాగే టీమ్ అంతా హానెస్ట్ గా చేసిన వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ నెల 14న "సంతాన ప్రాప్తిరస్తు" తప్పకుండా చూడండి. అన్నారు.
