తమిళనాడు తరహాలో ఎద్దులతో కుమ్ములాట... భీమవరంలో లోకల్ జల్లికట్టు!
తమిళనాడులో జల్లికట్టు సంప్రదాయాన్ని చూసి, ఆ రాష్ట్రానికి సరిహద్దులో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో కూడా ఫాలో అవుతున్నారు. ఇక్కడ కూడా జల్లికట్టు క్రీడను స్థానికులు సంబరంగా ఆడుతున్నారు. అక్కడ యువత అంతా ఎడ్ల కొమ్ముల దెబ్బలకు ఎదురొడ్డి, రక్తం చిందిస్తూ కూడా జల్లికట్టు ఆటను ఆడినట్లు ఇక్కడ కూడా ఆడుతున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరం గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జల్లికట్టు చూసేందుకు ఇతర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎద్దులకు ఎదురెళ్ళి... అవి కొమ్ములతో కుమ్ముతున్నా, వెంటపడి మరీ ఉషారుగా జల్లికట్టు ఆటను కొనసాగించారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా, గ్రామంలో కుర్రకారు అంతా మూకుమ్మడిగా ఈ ఆట ఆడుతున్నా... ఎక్కడా పోలీసుల నుంచి ప్రతిఘటన లేకపోవడంతో మరింత హుషారుగా లోకల్ జల్లికట్టు సాగింది.