1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 27 నవంబరు 2021 (10:11 IST)

రాయ‌లసీమ‌లో త‌గ్గ‌ని వ‌ర‌ద భ‌యం...

విల‌య‌తాండ‌వం చేసిన వ‌ర్షాలు కొంచెం త‌గ్గినా, వ‌ర‌ద ముప్పు మాత్రం రాయ‌ల‌సీమ వాసుల‌కు కునుకు లేకుండా చేస్తోంది. మ‌ళ్ళీ తుపాను వ‌స్తుందనే భ‌యం స్థానికుల్లో వ‌ణుకు పుట్టిస్తోంది. ఇప్ప‌టికే చిత్తూరు జిల్లాలో విద్యాలయాలకు సెలవు ప్ర‌క‌టించారు. 

 
తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఉంద‌ని, అధికారులు, సిబ్బంది  అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ ఆదేశించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాజ్ వే లు దాటరాదని హెచ్చ‌రించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాల ఏర్పాటు అధికారులు సిద్ధం గా ఉండాల‌ని జిల్లా కలెక్టర్ ఎం.హరిణారాయణన్ సూచించారు.

 
అనంతపురం జిల్లాకు నేడు ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ రానున్నారు. జిల్లాలో వచ్చిన వరదలు, వాటి వలన కలిగిన నష్టంపై అధికారులతో సమీక్ష చేస్తారు. బాధితులకు అందుతున్న సాయం, పంట నష్టంపై ప‌రిశీల‌న చేయ‌నున్నారు.
 

మ‌రో ప‌క్క భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అనంత‌పురంలో ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అత్యవసర పని ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, 104 కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. రిజర్వాయర్లు, నదులు, చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.