మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (09:02 IST)

కుప్పంలో వింత శబ్దాలు.. హడలిపోయిన స్థానికులు...

చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గంలో ప్రజలు వింత శబ్దాలతో హడలిపోయారు. ఈ శబ్దాలు ఉన్న ఆనేక మంది ప్రాణభయంతో ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ శబ్దాలు భూమిలోపలి భాగం నుంచి వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా, నియోజకవర్గంలోని గడ్డూరు, చిన్న గెరిగెపల్లి, పెద్ద గెరిగెపల్లి, దేసినాయనపల్లి, యానాది కాలనీల్లో ఈ శబ్దాలు వినిపించాయి. 
 
అలాగే, బెంగుళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా వినిపించాయి. గత యేడాది కూడా ఇలాంటి శబ్దాలు వచ్చాయి. ఇవి యుద్ధ విమానం పరీక్షిస్తున్నపుడు వచ్చే శబ్దాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్) వెల్లడించింది. దీంతో అపుడు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇపుడు ఇదే తరహా శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.