రంగోళీ చల్లుకుని, మన్మధరాజా డ్యాన్సులు... సాక్షాత్తు సచివాలయంలో!
గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసింది, గ్రామాలకు సేవ చేయాలని. అందుకే అక్కడ జగన్మోహర్ రెడ్డి ప్రభుత్వం గ్రామ వలంటీర్లను, సచివాలయం సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారికి కేవలం 5 వేల రూపాయలు మాత్రమే జీతం ఇస్తుండటంతో, పనిలో వారిలో సీరియస్ నెస్ కరువు అవుతోంది. కొంత మంది యువతీ యువకులు కష్టపడి వలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూ, అందరికీ దగ్గర అవుతున్నారు. కానీ, కొంత మంది ఈ ఉద్యోగాన్ని టైం పాస్ గా తీసుకుని, గ్రామ సచివాలయ వ్యవస్థను పలుచన చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కట్టమంచి సచివాలయంలో ఇద్దరు వలంటీరు సిబ్బంది చిందులు వేయడం వివాదాస్పదం అయింది. మోనికా, జగదీష్ అనే ఇద్దరు సచివాలయ సిబ్బంది మన్మధరాజా అంటూ, ముఖానికి రంగోళీ కొట్టుకుని, సినిమా పాటలకు చిందులు వేశారు. పలువురు వ్యక్తులతో కలిసి నృత్యాలు ఆడిన మహిళా సిబ్బంది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనితో రెవిన్యూ అధికారులు విచారణకు ఆదేశించారు. మోనికా, జగదీష్ లు ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.