సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (20:14 IST)

74మంది సచివాలయ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా

చిత్తూరు జిల్లాలో 74మంది సచివాలయ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వైకాపా నాయకులు తమను వేధిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. 
 
వివరాల్లోకి వెళితే.. జగనన్న కాలనీల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ధర్నాకు దిగిన వాలంటీర్లు ఆరోపించారు. 
 
పాకాల పంచాయతీలోని రెండు గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు గురువారం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో తహసీల్దారు భాగ్యలక్ష్మిని కలిశారు. 
 
స్థానిక పంచాయతీ కార్యదర్శి కుసుమకుమారి తమపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపిస్తూ.. మూకుమ్మడిగా రాజీనామా పత్రాల్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని వాలంటీర్లకు తహసీల్దార్‌ హామీ ఇచ్చారు.