గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:31 IST)

ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రుతుపవన ద్రోణి పోరుబందర్, సూరత్, జల్గావ్, రామగుండం, మచిలీపట్నంల మీదుగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. 
 
ఒక ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km ఎత్తుల మధ్య ఏర్పడింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ పేర్కొంది.