శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:21 IST)

ఏపీలో ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష - అపరాధం

ఏపీలోని ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణలకు పాల్పడుతున్నారు. దీంతో వారు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 
 
నెల్లూరు జిల్లా తాళ్ళపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని పరిహారం ఇవ్వకపోవడంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఆదేశించినా పరిహారం ఇవ్వరా అంటూ నిలదీసింది. అందుకే అధికారుల వేతనాల నుంచి కట్ చేసి బాధిత మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
జైలుశిక్షతో పాటు అపరాధం విధించిన అధికారుల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న శేషగిరిబాబు, ఎస్ఎస్ రావత్21, ముత్యాల రాజులు ఉన్నారు. వీరిలో శేషగిరిబాబుకు 2 వారాల జైలుశిక్ష, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు విధించింది. అలాగే, శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది.