Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'నదివే...' లిరికల్ సాంగ్ ను హిందీతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం..ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. 'నదివే...' పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. 'నదివే నువ్వు నదివే, నీ మార్పే రానుంది వినవే. నదివే నువ్వు నదివే..నీకే నువ్వియాలి విలువే..సిలువ బరువేమోయక, సులువు భవితే లేదుగా, వెన్నెల వలదను కలువే నువ్వుగా..నదివే నువ్వు నదివే..' అంటూ ప్రేయసి ప్రత్యేకతను పొగుడుతూ పొయెటిక్ గా సాగుతుందీ పాట. చిత్రీకరణ తుది దశలో ఉన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.