సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి
Rana Daggubati, Praveena Paruchuri, Manoj Chandra
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ఈ సినిమా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పాత్రలన్నీ చాలా సజీవంగా కనిపించాయి. అన్ని మనకి తెలిసిన పాత్రలే మన చుట్టూ ఉన్న పాత్రలే అనిపించాయి. డైరెక్టర్ ప్రవీణ కార్డియాలజిస్ట్. తను ప్రాక్టీస్ చేస్తూనే ఈ సినిమా తీశారు. అలాగే మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు. ఒక సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి అనే ఒక ఆలోచనకు భిన్నంగా వాళ్లు ఈ సినిమాని తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన ప్రవీణకి థాంక్యూ. తను ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మనోజ్ మస్త్ హీరో లాగా ఉన్నాడు. ఈ సినిమాని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది బాధ్యత మీదే. అందరికీ థాంక్యూ సో మచ్. సినిమా జూలై 18న రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూసి సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు,.
డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ, నిర్మాతగా ఇది నా మూడో సినిమా. డైరెక్టర్ గా నా మొదటి సినిమా. మీరు కేరాఫ్ కంచరపాలెం సినిమాని ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ సినిమా తీగలిగాను. రానా గారు వల్లే కేరాఫ్ కంచరపాలెం సినిమా జనాల్లోకి వెళ్ళింది. రానాగారి లాంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ నాలాంటి ఫిలిం మేకర్స్ చేస్తున్న సినిమాల్ని సపోర్ట్ చేయాలంటే ఆడియన్స్ వచ్చి తప్పకుండా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి. కంచరపాలెం సినిమాని చాలామంది థియేటర్స్ లో మిస్సయ్యమని చెప్పారు. ఈ సినిమా మాత్రం థియేటర్లో మిస్ అవ్వొద్దు. తప్పకుండా చూడండి. మీ మీద నమ్మకంతో ఈ సినిమా తీశాను అన్నారు.
హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ, ఈ సినిమాలో చూస్తున్న రామకృష్ణ మొదట ఇలా లేడు. రామకృష్ణుని అంత అద్భుతంగా తయారుచేసిన క్రెడిట్ డైరెక్టర్ ప్రవీణ గారికి దక్కుతుంది. సినిమా కోసం టీం అందరూ కష్టపడ్డారు. మా కష్టాన్ని గుర్తించిన రానా గారికి ధన్యవాదాలు.కష్టపడి నిజాయితీగా ఒక సినిమా తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఆదరిస్తారని ఈరోజు మరోసారి నిరూపించారు. మీ రెస్పాన్స్ అదిరిపోయింది. నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థాంక్యూ సో మచ్. లవ్ యు ఆల్'అన్నారు