1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (12:31 IST)

నేడు - రేపు భారీ వర్షాలు - చిత్తూరు జిల్లాల్లో స్కూల్స్ సెలవు

శ్రీలంక - తమిళనాడులకు మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడులకు సమీపంలో ఉన్న చిత్తూరులో ఈ వర్ష ప్రభావం అధికంగా వుంది. దీంతో ఆ జిల్లాలో విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు దక్షిణంగా ఈ నెల 29వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది క్రమంగా బలపడి పశ్చి, వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
దీంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
మరోవైపు, ఈశాన్య భారతం నుంచి తెలంగాణా వైపు తక్కువ ఎత్తులో గాలులు వస్తుండటంతో నేడు, రేపు తెలంగాణాలో ఓ మోస్తరు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.