1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (08:49 IST)

రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మరింతగా బలపడి వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు రాష్ట్రం వైపు పయనిస్తోంది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో మరోమారు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే నైరుతి బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ముఖ్యంగా, శుక్రవారం నుంచి ఆదివారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, శ్రీలంక - దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం తమిళనాడులోని ఉత్తరాది జిల్లాలతో పాటు.. ఏపీలోని రాయలసీమ, కో్సాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది.