ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (16:48 IST)

సంక్రాంతికి భీమ్లా నాయక్.. ఏపీ సర్కారు షాక్.. ఏమైంది?

సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్‌కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు రాస్తున్నాడు. 
 
ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌గా నిత్యా మీనన్ న‌టిస్తోంది. రానా మరో హీరోగా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. కానీ భీమ్లా నాయక్ విషయంలో మాత్రం ఇది కనిపించడం లేదు.
 
ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. టికెట్ రేట్లను పరిగణనలోకి తీసుకొని బిజినెస్ అనుకున్న దాని కంటే కాస్త తక్కువ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.85 కోట్ల రేంజ్‌లోనే జ‌రుగుతుంది. 
 
ప్రస్తుతం ఉన్న టికెట్ల ధ‌ర‌ల‌ కారణంగా రూ.15 కోట్లు తక్కువకే బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సినిమా విడుదల సమయానికి జగన్ ప్రభుత్వం మనసు మార్చుకుని టికెట్ రేట్లు పెంచితే డిస్ట్రిబ్యూటర్లకు అంతకంటే పండగ చేసుకునే విషయం మరొకటి లేదు.