ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (07:31 IST)

నీట్ పరీక్షల్లో టాప్ 100లో నిలిచిన తెలుగు విద్యార్థులు

నీట్ -2021 సంవత్సరానికిగాను పరీక్షా ఫలితాలను ఇటీవల వెల్లడయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిద్యార్థులకు చెందిన ర్యాంకులను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసింది. టాప్-100 ర్యాంకుల్లో ఏపీకి చెందిన 11 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 8 మంది ఓసీ కేటరిగిరీకి చెందిన విద్యార్థులు కాగా, ముగ్గురు ఓబీసీ వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఈ యేడాది రాష్ట్రం నుంచి నీట్ పరీక్షకు మొత్తం 39,388 మంది విద్యార్థులు అర్ఙతసాధించారు. వారు సాధించిన కటాఫ్ మార్కులను పరిశీలిస్తే, ఓసీ విద్యార్థులు 138 మంది, జనరల్ పీడబ్ల్యూటీ విభాగం విద్యార్థులు 122, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు 108 మంది ఉన్నారు. 
 
ఈ పరీక్షల్లో టాప్‌-100 లోపు ర్యాంకులు సాధించి విద్యార్థుల వివరాలను పరిశీలిస్తే, 13వ ర్యాంకును చందం విష్ణు వివేక్, 15వ ర్యాంకు జి.రుషీల్, 27వ ర్యాంకు పి.వెంకట కౌశిక్ రెడ్డి, 36వ ర్యాంకు కేతంరెడ్డి గోపీచంద్ రెడ్డి, 41వ ర్యాంకు టి.సత్యకేశవ్, 47వ ర్యాంకు పి. వెంకటసాయి అమిత్, 53వ ర్యాంకు పి.కార్తీక్, 58వ ర్యాంకు ఎస్. వెంకట్ కల్పజ్, 71వ ర్యాంకు కె.చైతన్య కృష్ణ, 84వ ర్యాంకు పి.సాకేత్, 89వ ర్యాంకు వి.నిఖిత్‌లు ఉన్నారు.