శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (17:43 IST)

ఔను.. వాళ్లిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు... కస్తూరి రాజా

కోలీవుడ్ స్టార్ ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకోబోతున్నట్టు ఈ దంపతులిద్దరూ వేర్వేరుగా ప్రకటించారు. కానీ, ధనుష్ తండ్రి, తమిళ సినీ దర్శకుడు కస్తూరి రాజా మాత్రం మరోలా స్పందించారు. ధనుష్, ఐశ్వర్య దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పారు. 
 
కేవలం వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థల కారణంగా తీవ్రమైన మానసికవేదనతో వారిద్దరూ అలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు. పైగా, వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నారని, వారితో చెన్నైకు తిరిగి వచ్చిన తర్వాత వారిరద్దరినీ ఒక చోట చేర్చి మాట్లాడుతామన్నారు.  
 
"అన్ని కుటుంబాల్లో ఉన్నట్టుగానే ధనుష్, ఐశ్వర్య మధ్య కూడా చిన్నపాటి కలహాలు ఉన్నాయి. అవి ముగిసేవి కావు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. కొన్ని సలహాలు కూడా ఇచ్చాను" అని చెప్పారు. "వీరిద్దరిని సమాధానపరిచి తిరిగి ఒక్కటి చేసేందుకు తనతో పాటు తమ కుటుంబ సభ్యులు, రజనీకాంత్ తరపు బంధువులు ప్రయత్నిస్తున్నామని" చెప్పారు. 
 
కాగా, 18 యేళ్ళ వివాహం బంధం తర్వాత ఎవరివారు తమ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నామని ధనుష్ ప్రకటించడం, ఆ తర్వాత ఐశ్వర్య కూడా ఇదే విషయాన్ని తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించడం జరిగింది. గత 2004లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న వీరిద్దరికీ యాత్రా, లింగా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.