మిథాలీ రాజ్ అద్భుతమైన ఫీట్: ప్రశంసించిన గవర్నర్ తమిళసై
మిథాలీ రాజ్ 6 అంతర్జాతీయ ప్రపంచ కప్‌లు ఆడిన మొదటి మహిళగానూ, మూడవ క్రికెటర్‌బే ఓవల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మహిళల ప్రపంచకప్ ఓపెనర్‌లో మిథాలీ అద్భుతమైన ఫీట్ సాధించింది. ఈ ఘనత సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ డా. తమిళిసై సౌందరరాజన్ కూలో పోస్ట్ చేశారు.
సచిన్ టెండూల్కర్- జావేద్ మియాందాద్ తర్వాత 6 వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్‌లు ఆడిన మొదటి మహిళ, మూడవ క్రికెటర్ అయినందుకు మిథాలీరాజ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. తరతరాలకు మహిళలకు స్పూర్తిదాయకంగా నిలుస్తారంటూ ప్రశంసించారు.