1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (22:04 IST)

వన్డే ర్యాంకింగ్స్‌: టాప్ ర్యాంక్‌లో భారత కెప్టెన్ మిథాలి

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం 762 పాయింట్లతో మిథాలి.. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లిజెల్లీ లీతో కలిసి ఉమ్మడిగా నెం1 స్థానంలో కొనసాగుతోంది.

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లీ అజేయంగా 91 పరగులు సాధించి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. ఇక భారత ఓపెనర్ స్మృతి మంధాన తొమ్మిదో స్థానంలో నిలిచింది.
 
బౌలర్లలో భారత పేసర్ జూలన్ గోస్వామి, సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ వరుసగా ఐదవ, తొమ్మిదవ స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఐదో స్థానంలో కొనసాగుతోంది. . టీ 20 ర్యాంకింగ్స్‌లో భారత యువ సంచలనం షఫాలి వర్మ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది.