స్వర్ణ దేవాలయంలోనూ ఆర్.ఆర్.ఆర్. నుంచి ఆ ముగ్గురే
ఆర్.ఆర్.ఆర్. ప్రమోషన్‌లో భాగంగా రోజుకొక రాష్ట్రంను టీమ్ పర్యటిస్తోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకుని అక్కడ మీడియాతో సమావేశం అయ్యారు. అక్కడ అమీర్‌ఖాన్ ముఖ్య అతిథి. హుషారెత్తించేందుకు వేదికపైనే నాటునాటు.. సాంగ్‌కు అనుగుణంగా డాన్స్ వేశాడు అమీర్. రామ్‌చరణ్, ఎన్.టి.ఆర్.లు కూడా స్టెప్‌లేశారు. ప్రమోషన్‌లో ఆర్.ఆర్.ఆర్.నుంచి కేవలం ముగ్గురు మాత్రమే పర్యటిస్తున్నారు.
సోమవారంనాడు రాజమౌళి, ఎన్.టి.ఆర్, రామ్‌చరణ్ కలిసి అమృత్‌సర్ వెళ్ళారు. అమృత్‌సర్‌లోని దైవిక స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. గురునానక్ ఆశీర్వాదం కోసం ప్రార్థనలు చేశారు. ఈనెల 25న సినిమా విడుదలకాబోతోంది. ఎక్కడికి వెళ్ళినా సినిమా గురించి పత్య్రేకంగా చెప్పేందుకు ఏమీ లేకపోయినా చెప్పిందే చెప్పాల్సి వస్తుందని హైదరాబాద్ మీట్‌లో తెలియజేశారు. మరి ఇంత ప్రచారం జరుగుతున్న ఈ సినిమా ఏ మేరకు ట్రెండ్ సృష్టిస్తుందే చూడాల్సిందే.