ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (11:34 IST)

ఇంటి ముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోసిన సర్పంచ్

తన ఇంటి ముందు నిరసనకు దిగిన యువతి ముక్కు కోశాడో గ్రామ సర్పంచి. గ్రామ ప్రజంలదరికీ రక్షణగా ఉండాల్సిన ఈ గ్రామ సర్పంచ్... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలను వేధింపులకు గురిచేశాడు. 
 
దీంతో ఆ ముగ్గురు యువతులు గ్రామ సర్పంచ్ ఇంటిముందు నిరసనకు దిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ గ్రామ సర్పంచ్ నిగ్రహం కోల్పోయి ఓ యువతి ముక్కు కోశాడు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సుపౌల్ జిల్లా లోథ్‌లో గ్రామ సర్పంచ్ తమను ఇబ్బదులకు గురిచేస్తున్నాడని ముగ్గురు యువతులు ఆరోపించారు. అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో కోపంతో ఊగిపోయిన గ్రామ సర్పంచ్ ఓ యువతి ముక్కు కోయడం సంచలనంగా మారింది. 
 
దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడి అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు, తన మద్దతుదారులను ఈ బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారంటూ గ్రామ సర్పంచ్ కూడా బాధిత అమ్మాయి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు.