గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (15:25 IST)

మధుబని రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

బీహార్‌లోని మధుబని రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. అన్ని బోగీలకు మంటలు వ్యాపించాయి. దాంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. దాంతో చుట్టూ పొగలు కమ్ముకున్నాయి. 
 
దీంతో రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు మంటలను ఆర్పివేశామని సహాయక సిబ్బంది తెలిపారు. 
 
మధుబని రైల్వే స్టేషన్‌లో స్వతంత్ర సేనాని సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ బోగీల్లో ఉదయం 9:50 గంటలకు మంటల చెలరేగాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. 
 
అయితే ప్రమాదం జరిగినప్పుడు ట్రైన్‌లో ఎవరు లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఎవరికి గాయాలు కూడా కాలేదు. అయితే ఆగి ఉన్న రైల్లో మంటలు చుట్టుముట్టడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.