శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (21:25 IST)

భారతీయ రైల్వే కీలక నిర్ణయం: బోగీలను అద్దెకు ఇస్తారట!

భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే వినూత్న ప్రాజెక్టును ప్రారంభించింది. ఆసక్తి గల ప్రైవేట్​ సంస్థలు లేదా వ్యక్తులు బోగీలను అద్దెకు తీసుకొని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కొత్త విధానంపై ఆసక్తిగల వారికి వారి అభిరుచికి తగ్గట్లు బోగీలను తీర్చిదిద్ది అద్దెకు ఇస్తారు. లేదంటే శాశ్వతంగానూ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తారు. 
 
బోగీ లీజు కాలపరిమితి అయిదేళ్ల పాటు ఉంటుంది. లీజు వ్యవధి పూర్తయిన తర్వాత దాన్ని జీవితకాలం వరకు పొడిగించుకోవచ్చు. రూట్లు, టారిఫ్​ నిర్ణయాధికారం మాత్రం అద్దెకు తీసుకున్న వారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లుగా నడపొచ్చని రైల్వేశాఖ తెలిపింది. తద్వారా రైలు ఆధారిత పర్యాటకాన్ని మరింత విస్తరించవచ్చని అభిప్రాయపడింది.