1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. TS ECET Counselling 2021 - Registration from Today

నేటి నుంచి టీఎస్ఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్

TS ECET Counselling 2021
తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈసెట్‌ ద్వారా పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం ఈ నెల 14వ తేదీ మంగళవారం నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 
 
14, 15 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 17న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. విద్యార్థులు ఈ నెల 17 -20 వరకు ట్యూషన్‌ ఫీజును చెల్లించాలని సూచించారు. ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 6,894 సీట్లు లభ్యంకానున్నాయి. ఈ సీట్లను పూర్తిగా కన్వీనర్‌ కోటాలో భర్తీచేయనున్నారు. ఇంజినీరింగ్‌లో 6,521, బీ ఫార్మసీలో 321, ఫార్మా -డీలో 52 సీట్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
About Writer
ఠాగూర్