గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:42 IST)

నితిన్ "మాస్ట్రో" నుంచి ప్రమోషనల్ సాంగ్ "షురుకరో షురుకరో" రిలీజ్ (Video)

యువ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "మాస్ట్రో". బాలీవుడ్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన "అంధాదున్" సినిమాకు రీమేక్‏గా తెలుగులోకి తెరకెక్కించారు. ఇందులో నభా నటేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. మిల్కి బ్యూటీ తమన్నా నెగిటివ్ షెడ్‏లో కనిపిస్తుంది. డైరెక్టర్ మేర్లపాటి గాంధీ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రం థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో చివరి క్షణంలో ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‏ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‏లో భాగంగా 'మాస్ట్రో' నుంచి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ విడుదల చేస్తూ.. ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. 
 
తాజాగా 'మాస్ట్రో' నుంచి టైటిల్ సాంగ్‌ను చిత్రయూనిట్  వీడియో విడుదల చేసింది. "మాస్ట్రో, మాస్ట్రో" అంటూ సాగే ఈ పాటలో నితిన్ క్లాసీ స్టెప్పులు, నభా నటేష్, తమన్నా మెరుపులు మైమరపిస్తున్నాయి. "షురుకరో షురుకరో" అంటూ ట్యూన్ ప్రారంభమై.. అంతకంతకు అదిరిపోయో స్టెప్పులతో సెట్టింగులతో హీట్ పెంచారు.
 
ఈ పాటను సింగర్ రేవంత్ ఆలపించగా.. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. మాస్ట్రో సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానరుపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి.. రాజ్ కుమార్ ఆకెళ్లలు కలిసి నిర్మించారు. .....