శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (21:18 IST)

నితిన్ మ్యాస్ట్రో ట్రైలర్ విడుదల...బెడ్రూమ్ సీన్స్ అదరగొట్టిన తమన్నా (video)

nithin
నితిన్ మ్యాస్ట్రో ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం నితిన్ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. మిగిలిన హీరోలు కరోనాకు భయపడి ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేకపోతున్నారు. కానీ నితిన్ మాత్రం ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత.. సెకండ్ వేవ్‌కు మధ్యలో వచ్చిన బ్రేక్‌లోనే రెండు సినిమాలతో వచ్చాడు. 
 
ఫిబ్రవరి 26న చెక్.. మార్చ్ 26న రంగ్ దే సినిమాలతో వచ్చాడు నితిన్. ఈ రెండు సినిమాలు కూడా అంచనాలు అందుకోలేదు. భారీ అంచనాలతో వచ్చిన రెండు సినిమాలు నిరాశ పరచడంతో ప్రస్తుతం హిట్టు కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు నితిన్. ఇలాంటి సమయంలో ఈయన నటిస్తున్న సినిమా థియేటర్స్ కాకుండా ఓటిటిలో విడుదల కానుంది. 
 
ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమాలో నటిస్తున్నాడు నితిన్. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది. విడుదలకు కూడా సిద్ధమైపోయింది. థియేటర్స్ కాకుండా కేవలం ఓటిటి కోసమే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 
 
సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ మాస్ట్రో సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హిందీలో సూపర్ హిట్టైన అంధాధూన్ సినిమాకు రీమేక్ ఇది. కథలో పెద్దగా మార్పులేం చేయకుండా ఉన్నదున్నట్లు తెలుగులో దించేసారు మేకర్స్. అనవసరంగా ప్రయోగాలు చేయడం కంటే.. ఉన్న కథను కాస్త మార్పులు చేసుకుని చేయడం బెటర్ అని ఫిక్సైపోయారు. 
 
అందుకే మాస్ట్రో ట్రైలర్ కూడా అంధాధూన్‌కు దగ్గరగానే ఉంది. పైగా ఈ సినిమాలో తమన్నా హాట్‌గా కనిపిస్తుంది. బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది. వీటికి సంబంధించిన సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. రీమేక్ అయినా కూడా మన ప్రేక్షకుల కోసం జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈయన గత సినిమా కృష్ణార్జున యుద్దం కూడా ప్లాప్ అయింది. దాంతో గాంధీకి కూడా మాస్ట్రో విజయం కీలకంగా మారింది.