శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (12:51 IST)

#HappyBirthdayNithiin అందమైన మనసులో ఇంత అలజడెందుకో... జయం నుంచి భీష్మ వరకూ...

నితిన్. అదృష్టం వరించి హీరోగా అరంగేట్రం చేసిన లక్కీయెస్ట్ పర్సన్ నితిన్. దర్శకుడు తేజ నువ్వు-నేను చిత్రం తీస్తున్న సమయంలో ఆయన కంట్లో పడ్డాడు నితిన్. అలా తొలిచిత్రం జయంతో విజయాల బాట పట్టాడు.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఫ్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఇవి ప్రతి హీరోకి సామాన్యమే. ఐతే భీష్మ చిత్రంతో తన స్టార్‌డమ్ ఏమిటో నిరూపించుకున్నాడు.
 
ఇటీవలే విడుదలైన రంగ్ దె చిత్రంతో సక్సెస్ కొట్టాడు. గత ఏడాది జూలై 16, 2020న షాలిని కందుకూరితో నితిన్‌ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హాజరయ్యాడు. రంగ్ దే సక్సెస్ సాధించిన నితిన్ ప్రస్తుతం 'అందాధూన్' రీమేక్‌ ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు. తను అభిమానించే హీరోల్లో పవర్ స్టార్ అగ్రస్థానంలో వుంటారు. ఆయన్ని దేవుడు అంటాడు నితిన్.