శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (07:02 IST)

అర్థనగ్నంగా నటించిన 'రంగ్ దే' హీరో!

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరోలు తమ ప్రత్యేకతను చాటేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇందుకోసం విభిన్నమైన కథలు ఎంచుకుంటున్నారు. ఇందులోభాగంగా, ఇటీవలే అల్లరి నరేష్ నటించి "నాంది" చిత్రంలో ఆయన ఫుల్ న్యూడ్‌గా కనిపించారు. జైల్లో ఉన్న ఓ సీన్ కోసం న్యూడ్ సీన్ చేశాడు నరేష్. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ కూడా న్యూడ్ సీన్ చేశాడంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది.
 
ఇకపోతే, ఇపుడు మరో యువ హీరో నితిన్ కూడా అలాగే నటించాడు. కాకపోతే, ఈయన అర్థనగ్నంగా తన తాజా చిత్రం "రంగ్ దే"లో కనిపించారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నితిన్ నటించిన 'రంగ్ దే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. మార్చి 26న విడుదల కానుంది. 
 
వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. "చెక్" ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న నితిన్.. "రంగ్ దే" సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇదిలావుంటే ఈ సినిమాలో నితిన్ నగ్నంగా కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఈ మధ్యే నాంది సినిమాలో అల్లరి నరేష్ నగ్నంగా కనిపించాడు. అందులో ఆ సన్నివేశం హైలైట్ అయింది. దాన్నే ప్రమోషన్ కోసం కూడా వాడుకున్నారు చిత్రయూనిట్. జైల్లో ఉన్న ఓ సీన్ కోసం న్యూడ్ సీన్ చేశాడు నరేష్. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ కూడా న్యూడ్ సీన్ చేశాడంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది.
 
దీనిపై నితిన్ స్పందించాడు. బయట ప్రచారం జరుగుతున్నట్లు తమ సినిమాలో అలాంటి సీన్ లేదని.. కాకపోతే హాఫ్ న్యూడ్ సీన్ ఉందని మాత్రం చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ మధ్య ఓ ఇంటిమేట్ సీన్ ఉంది. దాన్ని చాలా రొమాంటిక్‌గా తెరకెక్కించాడు. 
 
ట్రైలర్‌లోనే ఈ సీన్ రివీల్ చేశారు కూడా. సినిమాలో కూడా ఈ సీన్ చాలా అద్భుతంగా వచ్చిందని చిత్రయూనిట్ చెప్తున్నారు. ఈ సీన్ కోసమే నితిన్ హాఫ్ న్యూడ్‌గా నటించాడని.. అంతేకానీ నగ్నంగా మాత్రం లేదని చెప్పుకొచ్చాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం న్యూడ్‌గా నటించాడంటూ ప్రచారం చేస్తున్నారు. దానివల్ల సినిమాకు ప్రమోషన్ పెరుగుతుంది.