శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 మార్చి 2021 (10:56 IST)

కేక పుట్టించిన దీపికా పిల్లి... 'సారంగ దరియా'కు అదిరిపోయే డ్యాన్స్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య - సాయిపల్లివి జంటగా నటిస్తున్న చిత్రం లవ్‌స్టోరీ. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేస్తున్నారు. అందులోభాగంగా, ఇటీవల విడుదల చేసిన సారంగ దరియా పాట నెట్టింట సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. 
 
ఈ పాటకు సాయిపల్లవి వేసిన స్టన్నింగ్స్ డ్యాన్స్‌కు ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో గతంలో సాయిపల్లవి పేరుమీదన్న అన్ని రికార్డులు మాయమైపోతున్నాయి.
 
ఇదిలావుంటే, తాజాగా సారంగ దరియా పాటకు టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ తమదైనశైలిలో డ్యాన్స్ వేస్తూ ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా టిక్ టాక్ స్టార్, ప్ర‌ముఖ టీవీ షో యాంక‌ర్ దీపికా పిల్లి కూడా సారంగద‌రియా పాట‌కు త‌న‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేసి కేక పెట్టించింది. 
 
ఎంతో జోష్‌తో దీపికా చేసిన డ్యాన్స్ నెటిజ‌న్స్ మ‌న‌సులు దోచుకోగా, ప్ర‌స్తుతం దీపికాకు సంబంధించిన వీడియోను కూడా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఈ పాటకు గుడిలో డ్యాన్స్‌ చేయడం ప‌ట్ల కొంద‌రు అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీనికి కారణం ఏంటంటే.. దీపికా గుడిలో డ్యాన్స్ చేసింది. ఈ పాటతో పాటు మరో వీడియో కూడా చేసింది. దాంతో నెటిజన్లు గుడిలో ఇలాంటి డ్యాన్సలేంటి..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, మరో వైపు చాలా మంది దీపికా డ్యాన్స్‌ను మెచ్చుకుంటున్నారు. సూపర్‌గా చేసావ్ అంటూ అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దీపికా ప్రస్తుతం ఓ టీవీషోకు యాంకర్‌గా చేస్తుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది.