గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (23:20 IST)

బిజినెస్ అవార్డు వేడుక‌లో ఫోజులిచ్చిన రాశీఖ‌న్నా

Rashikhanna poses
న‌టి రాశీఖ‌న్నా టైమ్ బిజినెస్ అవార్డు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా శుక్ర‌వారం రాత్రి హాజ‌ర‌య్యారు. ప్ర‌ముఖ వ్యాపార‌రంగంలో ముందంజ‌లో వున్న వారికి టైమ్స్ ప‌త్రిక ఏర్పాటు చేసిన అవార్డులు ఇవి. ఈసారి ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌యి డేరింగ్ ఉమెన్‌గా త‌న కాస్ట్యూమ్స్‌ను ప్ర‌త్యేకంగా డిజైన్ చేసుకుని హాజ‌ర‌య్యారు. అందుకు ఈ ఫొటోలో సాక్ష్యం. గ‌తంలో 2017లో కూడా టైమ్ బిజినెస్ అవార్డు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. అందులో మంత్రి హ‌రీష్‌రావ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌యై విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం మ‌రికొంద‌రికి రాశీఖ‌న్నా అంద‌జేసింది. టైమ్స్‌కు రాశీఖ‌న్నాకు మంచి అనుబంధ‌ముంది.

Rashikhanna poses1
రాశీఖ‌న్నా చ‌దివింది బి.ఎ. ఇంగ్లీషు లిట్ అయినా వ్యాపారంగం అంటే ఆమెకు ఆస‌క్తి. న‌టిగా కాకుండే ఏదో రంగంలో వుండేది. సినిమారంగంలో ప్ర‌వేశించాక ఆమెకు పేరు, విజ‌యాలు వ‌చ్చాయి. తాజాగా మారుతి దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పక్కా కమర్షియల్ . ఈ చిత్రం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని GA2 మరియు UV క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవికాకుండా త‌మిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది.